Tuesday, June 16, 2009

సర్వధారినామ ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ వై.యెస్.రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా విశిష్ఠ పురస్కారం.(2008)

శిఖామణి సాహితీ రజతోత్సవ సందర్భంగా దారా సుబ్బరాజు,ఇంజినీర్ చేస్తున్న సత్కారం(2006)

తేనెపిట్ట

చడీచప్పుడు లేకుండా
ఎటునుండి ఎలా వచ్చిందో
ఈ తేనెపిట్ట

పిడికెడు లలిత దేహంతో
పుంజెడు రంగురంగుల తూలికలతో
కోటిస్వరాల కువకువలతో
నాలో నుంచే వచ్చినట్టు
నా ఆత్మకు రెక్కలు మొలిచినట్టు

ఇంతకు మునుపు మునుపు దీన్ని చూసిన ఙ్పకం లేదు
ఇదివరకు ఇది నా అనుభవం లోనిది కాదు
నా నుండి ఏమి తీసుకుందో
నాకు తెలియదు కానీ
ఈ పిట్ట మాత్రం నాకు చాలా ఇచ్చింది

---- శిఖామణి